ప్రభాస్ ‘రాజా డీలక్స్’ ఫస్ట్ లుక్

మారుతి డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి మూడ్నాలుగు ఫోటోలు లీకయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇందులో ఒకటి ప్రభాస్ – మారుతి సీన్ డిస్కషన్ లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. మరో పిక్ లో షూటింగ్ గ్యాప్ లో ప్రభాస్ మొబైల్ ఫోన్ లో మునిగిపోయారు. ఇక ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మారుతి స్టైల్ మేకింగ్ తో జెట్ స్పీడ్ తో ఈ సినిమా ను పూర్తి చేస్తున్నారు.