పైలట్ కు మరోసారి నిరాశ
మొయినాబాద్ ఫాంహౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాష్ట్ర సర్కార్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగత, కుటుంబ, ప్రైవేటు సమాచారాన్ని రాబట్టడానికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను విచారిస్తోందని, విచారణను నిలిపివేయాలని కోరుతూ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.
‘పార్టీ మారాలని తనకు రూ.వందకోట్ల ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ మాత్రమే చేశారు కానీ డబ్బు ఇవ్వలేదు. నగదు లావాదేవీలు జరగనందున ఈడీకి విచారణ పరిధి లేదు. ఈడీ ఈసీఐఆర్ మనీలాండరింగ్ చట్టానికి విరుద్ధం’ అని రోహిత్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషన్‌పై వాదనలు విన్న ధర్మాసనం రోహిత్ అభ్యర్థనను తిరస్కరిస్తూ తదుపరి విచారణను జనవరి 5కు వాయిదా వేసింది.