PS2 బిగ్ అప్ డేట్

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన భారీ మల్టీస్టారర్ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’  (#PS1). చోళుల చరిత్రతో ప్రముఖ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఆధారంగా తెరకెక్కించారు. సెప్టెంబర్ #PS1 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి విజయాన్ని అందుకుంది.

ఇప్పుడు #PS2 కోసం పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా అప్ డేట్ ను ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఇవ్వబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ భారీ మల్టీస్టారర్ లో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, శోభితా ధూళిపాళ, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, విక్రమ్ ప్రభు, అశ్విన్ కాకుమాను,  ఆర్. శరత్‌కుమార్, ఆర్. పార్తిబన్, ప్రభు, ప్రకాష్ రాజ్, రెహమాన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.

#PS2 ⚔ announcement today at 4 PM! pic.twitter.com/PeKpwZgpVW— OTTRelease (@ott_release) December 28, 2022