రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి చీఫ్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గ్రామ పంచాయితీలకు నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నిరసిస్తూ తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీంతో ముందస్తుగా పోలీసులు రేవంత్ రెడ్డిని గృహనిర్భంధం చేశారు.

మరోవైపు పోలీసులు అడ్డుకున్నా ఆందోళనలు కొనసాగిస్తామని కాంగ్రెస్‌ నేతలు ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా సర్పంచ్ ల ధర్నాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం, ముందస్తు అరెస్టులకు నిరసనగా జిల్లా, మండల కేంద్రాల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తు నిరసనలు చేపట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.