పెద్ద నోట్ల రద్దుకు సుప్రీం సపోర్టు

పెద్ద నోట్ల రద్దు అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెద్ద నోట్ల రద్దును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. 2016 నవంబర్‌ 8 నోటిఫికేషన్‌ చెల్లుబాటు అవుతుందని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన 58 పిటిషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు  సోమవారం తీర్పును వెలువరించింది. 

పెద్దనోట్ల రద్దు పై కేంద్రం తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టంగా లేదని.. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్నారని జస్టిస్‌ గవాయ్‌ తెలిపారు.