శ్రీలంకతో రెండో టీ20.. సంజూ స్థానంలో త్రిపాఠి ?

మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ లో లంక పై టీమిండియా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం జరగనున్న రెండో టీ20 లోనూ గెలుపొంది సిరీస్ ను కైవసం చేసుకోవాలని హార్దిక్ సేన భావిస్తున్నది. అయితే, చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్‌ మోకాలి గాయంతో మళ్లీ దూరం కావడం గమనార్హం.

దీంతో సంజూ స్థానంలో ఎవరు వస్తారనేది సందిగ్ధత నెలకొంది. రేసులో రుతురాజ్‌ గైక్వాడ్‌, రాహుల్‌ త్రిపాఠి ఉన్నారు. అయితే, రుతురాజ్‌ ఓపెనర్‌గా రాణించగలడు. అదే త్రిపాఠి నాలుగో స్థానంలో సరిపోతాడని క్రికెట్‌ విశ్లేషకుల అంచనా. దీంతో మేనేజ్‌మెంట్‌ రాహుల్‌ త్రిపాఠి వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌కు మరో అవకాశం ఇవ్వడం ఖాయం. దాంతో రుతురాజ్‌ ఈసారి కూడా బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. బ్యాటింగ్‌కు అనుకూలించే వాంఖడే పిచ్‌పై శ్రీలంక స్పిన్నర్లు (IND vs SL) అద్భుతంగా బౌలింగ్‌ చేసి భారత్‌ను అడ్డుకొన్నారు. అయితే, ఇక్కడే టీమ్‌ఇండియా స్పిన్నర్లు తేలిపోవడం గమనార్హం.