#ProjectK : దీపికా పదుకొనె ఫస్ట్ లుక్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె బర్త్ డే ఈరోజు. ఈ సందర్భంగా ఆమెకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు దీపికా నుంచి అభిమానులకు వరుస గిఫ్ట్స్ అందుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే పఠాన్ సినిమా నుంచి దీపిక సరికొత్త లుక్ ను రిలీజ్ చేశారు. ఇందులో ముద్దుగుమ్మ యాక్షన్ మూడ్ లో కనిపిస్తున్నారు.

తాజాగా ప్రాజెక్ట్ కె నుంచి దీపికా కు బర్త్ డే విషెస్ అందాయి. దీపికా షాడో పిక్ ఒకటి షేర్ చేసిన మేకర్స్ విషెస్ చెప్పారు. ప్రాజెక్ట్ కె నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫస్ట్ లుక్కు.. పిక్కూ రాలేదు. తాజాగా రిలీజ్ చేసిన దీపికా లుక్ నే ఫస్ట్ లుక్ అని చెప్పాలి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రమిది. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రాజెక్ట్ కె ప్రేక్షకుల ముందుకు రానుంది.