యాక్షన్ మూడ్ లో దీపికా.. !

 షారుఖ్ ఖాన్ – దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ ‘పఠాన్’. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వహించారు.  జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగం పెంచిన చిత్రయూనిట్ దీపికా పదుకొనె లెటేస్ట్ లుక్ ఒకటి వదిలారు. ఇందులో దీపిక చేతిలో గన్ పట్టుకొని యాక్షన్ మూడ్ లో కనిపిస్తున్నారు. 

ఇక పఠాన్ గురించి మరో ఆసక్తికర విషయం తెలిసిందే. 2019 లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ , వాణీ కపూర్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘వార్’ కి కొనసాగింపుగా పఠాన్ ను తెరకెక్కించారట. ఈ మేరకు అప్ డేట్ చేస్తూ యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రేక్షకులను సప్రైజ్ చేసింది. అన్నట్టు.. యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న 50వ సినిమా ఇది. వార్ కి సీక్వెల్ కావడంతో.. పఠాన్ లో హృతిక్ రోషన్ కూడా గెస్ట్ రోల్ లో మెరబోతున్నారు.