శర్వానంద్ పెళ్లి ఫిక్స్.. ! అమెరికా అమ్మాయితో ఏడడుగులు !?

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి ఫిక్సయింది. అతి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్టు సమాచారం. అమెరికాకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగినితో శర్వా ఏడడుగులు వేయబోతున్నట్లు చెబుతున్నారు. హీరో అయినా.. పర్సనల్ లైఫ్ ను చాలా కూల్ గా సాగించే శర్వా.. ఆయన టేస్ట్ కు తగ్గట్టుగా అమ్మాయిని సెలక్ట్ చేసుకున్నారంట.  వాస్తవానికి ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లిగా ప్రచారం జరుగుతున్నా.. కొన్నాళ్లుగా ఆ అమ్మాయితో శర్వా లవ్ లో ఉన్నట్టు టాక్.


ఇక టాలీవుడ్ లో పెళ్లికానీ ప్రసాదుల లిస్టు పెద్దదే. ప్రభాస్, శర్వానంద్, అడవిశేష్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, రామ్.. ఇలా చెప్పుకుంటే పోతే జాబితా చాలా పెద్దదే. అయితే వీరి గ్యాంగ్ నుంచి శర్వానంద్ అతి త్వరలో అవుట్ కానున్నారు. తన సినిమాల అప్ డేట్స్ నే సరిగ్గా ప్రేక్షకులతో పంచుకోని.. శర్వా.. ఇక తన పెళ్లి పనులను సీక్రెట్ గానే మొదలుపెట్టారట. మరోవారంలో పెళ్లి అనేదాకా మేటర్ బయటికి రాకూదని అనుకున్నారట. కానీ ఈలోపు ఎవరో ఒకరి ద్వారా బయటికి లీకైపోయింది. శర్వా పెళ్లి మేటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాప్ అయింది.