మరో 6 నెలల్లో ఎన్నికలు

తెలంగాణలో ఎన్నికలకు వేళ అయ్యింది. మరో 6 నెల్లలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ పోలింగ్ బూతు కమిటీ సభ్యుల సమ్మేళనంలో బండి సంజయ్‌ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా సరల్‌ యాప్‌ను ఆయన ప్రారంభించారు.

సరల్‌ యాప్‌లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాలు, కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులను పొందుపరుస్తున్నామని బండి సంజయ్‌ వివరించారు. పోలింగ్ బూత్‌ కమిటీల ద్వారానే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం పోలింగ్ బూత్ అధ్యక్షుడిగా పనిచేశారని గుర్తు చేశారు.