తెలంగాణ కొత్త సీఎస్‌ శాంతికుమారి

తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి నియమితులయ్యారు. సోమేశ్‌కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. ఈ మేరకు హైకోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే.. సోమేశ్‌కుమార్‌ తెలంగాణ నుంచి రిలీవ్‌ కావాలంటూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొత్త సీఎస్‌ శాంతికుమారి పేరును తెలంగాణ సర్కార్ ఖరారు చేసింది. సీఎస్‌గా శాంతికుమారి 2025 వరకు పదవీలో కొనసాగనున్నారు.

1989 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి  .. ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గతంలో వైద్య, ఆరోగ్యశాఖల్లో బాధ్యతలు నిర్వహించారు. కేసీఆర్‌ మంత్రిగా ఉన్న సమయంలో మెదక్‌ కలెక్టర్‌గా పనిచేశారు.