అమెజాన్ ప్రైమ్ లో వారసుడు

టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన సినిమా ‘వారిసు/వారసుడు’. సంక్రాంతి కానుకగా వారిసు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఇక వారసుడు రెండ్రోజుల తర్వాత అంటే.. 14న రిలీజ్ కాబోతున్నారు. అయితే వారిసు బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో చిత్రబృందం సెలబ్రేషన్స్  షురూ చేసింది.

ఇలాంటి టైమ్ లో ఓటీటీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అందింది. వారిసు/వారసుడు ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. దీంతో పాటు స్ట్రీమింగ్ డేట్ ను ఎనౌన్స్ చేయనున్నారు. ఇక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వారిసును తమిళ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చూసిన జనాలు ఎమోషన్ అవుతున్నారు. విజయ్ ని కొత్తగా చూపించారని దర్శకుడు వంశీ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.