వారసుడు కూడా రొటీనే !
సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు నిలిచారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ, కోలీవుడ్ నుంచి అజిత్, విజయ్ బరిలో నిలిచారు. ఒకరి తర్వాత మరొకరు సినిమా థియేటర్ కు క్యూ కట్టాయి.
ముందుగా తునివు/తెగింపు, వారిసు రాగా.. ఆ తర్వాత వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రిలీజ్ అయ్యాయి. అయితే ఈ నాలుగు సినిమాలు కూడా పరమ రొటీన్ కథలు అనిపించుకున్నాయి. కేవలం అభిమానులను తృప్తిపరచడానికి మాత్రమే తీశారని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
వీరసింహారెడ్డి, వీరయ్య, తెగింపు రొటీన్ యాక్షన్ ఎంటర్ టైనర్లు కాగా.. వారసుడు రొటీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అనిపించుకున్నాడు. దీంతో.. సంక్రాంతి పండగ పూట వైవిద్యం మిస్సయిందని అంటున్నారు. అయితే ఆ లోటు ఓటీటీలు తీరుస్తున్నాయి. అన్ని భాషలకు సంబంధించి కొత్త తరహా కథలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.