‘నాన్ బీజేపీ.. నా కాంగ్రెస్’ అంటే ఇదే !
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తెలంగాణ సీఎం కేసీఆర్. దాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నాలు షురూ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఖమ్మం వేదికగా నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. పలువురు జాతీయ నేతలు ఈ సభకు హాజరయ్యారు. అయితే కేసీఆర్ జాతీయ పార్టీ (బీఆర్ఎస్) ప్రకటన కంటే ముందు నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ నినాదంతో థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు గట్టిగానే చేశారు. అది సాధ్యం కాదని తెలిసి.. టీఆర్ ఎస్ ను జాతీయపార్టీ బీఆర్ ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అయితే నిన్న ఖమ్మంలో జరిగింది బీఆర్ఎస్ ఆవిర్భావ సభ అయినా.. నాన్ బీజేపీ, నా కాంగ్రెస్ కూటమి లాగా కనబడింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరాయి విజయన్, సీపీఐ నేత డి. రాజా, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. అయితే వీరంతా అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కు దూరంగా రాజకీయాలు చేయాలని డిసైడ్ అయినవారే !. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సభ కాస్త నాన్ బీజేపీ, నా కాంగ్రెస్ కూటమిగా మారిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా.. కేంద్రంలో బీజేపీని ఢీకొట్టడమే తమ ధ్యేమం అంటున్నారు గులాబీ నేతలు.