BTS కాదు సలార్ టీజర్ కావాలి.. ఫ్యాన్స్ డిమాండ్ !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల అప్ డేట్స్ కోసం ఆయన అభిమానులు కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య వారంలోగా సలార్ అప్ డేట్ ఇవ్వకుంటే సూసైడ్ చేసుకుంటానని ఓ అభిమాని రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇలాంటి డిమాండ్లు బోలేడు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. అయితే సలార్ చిత్రబృందం టీజర్ ను విడుదల చేయలేదు. కానీ సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ బిటిఎస్‌ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. సలార్ షూటింగ్ కొనసాగుతుందని అప్ డేట్ ఇచ్చారు.

అయితే ఈ బీటీఎస్ వీడియోతో అభిమానులు సంతృప్తి చెందలేదు. తమకు పూర్తి టీజర్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు అయితే.. రాత్రిల్లో షూట్ చేశారా.. ? యాక్షన్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ పెట్టారు. ఈ చిత్రంలో ప్రభాస్ కి జంటగా శృతిహాసన్ నటిస్తోంది. సెప్టెంబర్ 28, 2023న సలార్ రిలీజ్ కానుంది.