పెళ్లాం-మొగుడు బాక్సాఫీస్ యుద్ధం

పెళ్లాం ఓటీటీలో.. మొగుడు థియేటర్స్ లో .. ఒకేరోజు సందడి చేయబోతున్నారు. అలియా భట్ నటించిన తొలి హాలీవుడ్ చిత్రం ‘హార్ట్ ఆఫ్ స్టోన్. టామ్ హార్పర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గాల్, జామీ, సోఫీ ఒకోనెడో, మథియాస్ ష్వీగోఫర్, జింగ్ లూసీ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా డైరెక్టర్ గా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఆగస్టు 11 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

మరోవైపు అర్జున్ రెడ్డి దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ నటించిన సినిమా ‘యానిమల్’. రష్మిక మందన హీరోయిన్. భూషన్ కుమార్ నిర్మాత. ఈ క్రైమ్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న థియేటర్లలో రిలీజ్ కానుంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కానుంది.