డబ్బుల కోసమే ఆ పని చేస్తున్నా.. అందులో తప్పేముంది ? హీరోయిన్ సూటి ప్రశ్న !

ఎవరైనా డబ్బుల కోసమే పని చేస్తారు. తాను కూడా డబ్బుల కోసమే సినిమాల్లో నటిస్తున్నా. దాంట్లో తప్పేముంది ? అని ప్రశ్నిస్తోంది యంగ్ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్‌. ‘ఎక్కువ డబ్బు సంపాదించడం కోసమే సినిమాల్లోకి వచ్చానని ప్రియా భవానీ చెప్పినట్లు ఓ ఆంగ్ల వెబ్ సైట్ రాయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ఈ విధమైన స్టేట్‌మెంట్‌ ఇచ్చినంటూ ఆధారాలు ఉన్నాయా ? అని ఆమె ప్రశ్నించారు.

సీరియల్‌ నటిగా కెరీర్‌ ఆరంభించిన ప్రియా భవానీ.. బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మేయాధ మాన్‌’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల విడుదలైన ‘కళ్యాణం కమనీయం’తో తెలుగు వారికి పరిచయమయ్యారు. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళంలో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు.