మంచు మనోజ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘వాట్ ఏ ఫిష్’

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ జనవరి 20 స్పెషల్ వచ్చేసింది. ఆయన లెటేస్ట్ సినిమాను ప్రకటించారు. కొత్త దర్శకుడు వరుణ్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ‘వాట్ ఏ ఫిష్’ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని #6ix Cinemas నిర్మించనుంది. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని తీసుకురానున్నారు. టోరంటో మరియు కెనడాలోని చాలా ప్రదేశాల్లో ఈ సినిమాని షూట్ చేయనున్నారు.

ఇక టైటిల్ పోస్టర్ లో మనోజ్ రాక్ స్టార్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు ? ఇతర వివరాలు తెలియాల్సి ఉన్నాయి. వాస్తవానికి ఈరోజు మనోజ్ తన రెండో పెళ్లి ప్రకటన చేస్తారనే ప్రచారం జరిగింది. కొన్నాళ్లుగా మనోజ్, మౌనిక అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నారు. ఫిబ్రవరి 2 న వీరి పెళ్లి జరగనుంది. ఈరోజు దానికి సంబంధించిన పెళ్లి ప్రకటన రానుందనే ప్రచారం జరిగింది. కానీ మనోజ్ తన కొత్త సినిమా ప్రకటన చేశారు.