సికింద్రాబాద్‌ ఫైర్ యాక్సిడెంట్ : షార్ట్‌ సర్య్కూట్‌ కారణం కాదు

సికింద్రాబాద్‌ మినిస్టర్‌ రోడ్డులోని షాపింగ్‌మాల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆరంతస్తుల భవనంలో గురువారం ఉదయం 11 గంటల నుంచి మంటలు చెలరేగాయి. శుక్రవారం కూడా మండుతూనే ఉన్నాయి. డ్రోన్ల ద్వారా పరిశీలిస్తే ముగ్గురు కూలీలు కాలీ బూడదైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమదానికి మొదట షార్ట్ సర్కూట్ కారణమై ఉంటుందని భావించారు. కానీ  అగ్నిప్రమాద ఘటనకు షార్ట్‌ సర్య్కూట్‌ కారణం కాదని విద్యుత్‌ శాఖ అధికారి శ్రీధర్‌ తెలిపారు. 

మంటలు వ్యాపిస్తున్న సమయంలో కొద్ది మీటర్ల దూరంలో విద్యుత్‌ సరఫరా ఉందన్నారు. ఒకవేళ షార్ట్‌ సర్య్కూట్ జరిగి ఉంటే సబ్ స్టేషన్‌లో ట్రిప్‌ అయ్యేదని.. కానీ అలా జరగలేదని ఆయన వివరించారు. గురువారం ఉదయం 11.20 గంటలకు సమాచారం అందగానే విద్యుత్ సరఫరా నిలిపివేశామన్నారు. చుట్టుపక్కల కాలనీలకు సాయంత్రం 6.30 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని తెలిపారు. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే మీటర్లు, వైర్లు పూర్తిగా కాలిపోయేవని చెప్పారు. భవనానికి మొత్తం 6 మీటర్లు ఉన్నాయన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలేంటనేది దర్యాప్తులో తేలుతుందని శ్రీధర్‌ చెప్పారు.