‘పఠాన్’ థియేటర్స్ ‘సెల్ఫీ’ ట్రైలర్ కూడా !

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ – దీపికా పదుకొనె జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘పఠాన్’. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే షారుక్ సినిమాను తో పాటు తమ సినిమాలను ప్రమోట్ చేసుకొనే పనిలో పడ్డారు బాలీవుడ్ స్టార్స్.

లవ్ రంజన్ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ – శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం #TuJhoothiMainMakkaar. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథంలో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ షురూ చేస్తోంది చిత్ర యూనిట్. ఈ నెల 23న ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ను షారుక్ ఖాన్ ‘పఠాన్’ థియేటర్స్ లో ప్రదర్శించబోతున్నారు.

తాజాగా మరో సినిమా ట్రైలర్ కూడా పఠాన్ థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతోంది.రాజ్ మెహతా దర్శకత్వంలో అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ, డయానా పెంటీ, నుష్రత్ బరుచా.. తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సెల్ఫీ’. ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను పఠాన్ థియేటర్స్ లో ప్రదర్శించబోతున్నట్లు మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. సెల్ఫీ అనేది 2019 మలయాళ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్‌కి అధికారిక రీమేక్.