‘తెగింపు’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

సంక్రాంతి సినిమాల ఓటీటీ రిలీజ్ డేట్స్ ఫిక్స్ అవుతున్నాయి. విజయ్ వారిసు/వారసుడు ప్రైమ్ లో ఫిబ్రవరి నెలలో స్ట్రీమింగ్ కానుంది. స్ట్రీమింగ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు.

మరోవైపు అజిత్ తునివు/తెగింపు నెట్ ఫ్లిక్స్ లో సందడి చేయనుంది.  ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం. హెచ్. వినోద్ డైరెక్షన్ లో తెగింపు తెరకెక్కింది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు అజిత్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. థియేటర్స్ లో సినిమా చూడడం మిస్ అయిన వారు ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.