అతియాతో కేఎల్ రాహుల్‌ పెళ్లి ఈరోజే !

భారత స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు. ప్రియురాలు అతియాశెట్టిని ఈరోజు పెళ్లాడబోతున్నాడు.

పుణెలోని లోనావాలాలో బంధువులు, స్నేహితుల సమక్షంలో వివాహ వేడుక  జరగనుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు పెళ్లిబంధంతో ఒక్కటి కాబోతున్నారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఆ బంధాన్ని పెళ్లిపీటల వరకు తీసుకొచ్చారు.