Official : హిట్ డైరెక్టర్ తో వెంకీ సినిమా

విక్టరీ వెంకటేష్ 75వ సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. హిట్, హిట్ 2 దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకీ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని వెంకట్ బోయిన్ పల్లి నిర్మించనున్నారు. ఎనౌన్స్ మెంట్ పోస్టర్ లో వెంకీ చేతిలో తుపాకి కనిపిస్తుంది. బ్యాక్ లుక్ పోస్టర్ లో.. అగ్నిపర్వతం ఎగిసిపడటం చూడొచ్చు.
ఎఫ్ 3 తర్వాత వెంకీ చేస్తున్న సినిమా ఇది. అయితే ఈసారి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాకుండా.. సీరియస్ కథను ఎంచుకున్నట్టు కనబడుతుంది.