పక్కనే సీఎం.. ప్రభుత్వంపై స్వామీజీ తీవ్ర విమర్శలు.. మైకు లాక్కున్న ముఖ్యమంత్రి

పక్కన ముఖ్యమంత్రి కూర్చుంటే.. ఎవరైనా పొగడ్తలతో ముంచెత్తుతారు. కానీ  ఈశ్వరనందపురి స్వామీజీ మాత్రం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కొద్దిసేపు ఓపిక పట్టిన సీఎం.. ఆ తర్వాత స్వామీజీ నుంచి మైక్ ను లాక్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


కర్ణాటకలోని మహదేవపురలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మహదేవపురలో జరిగిన ఓ బహిరంగ సభలో కాగినేలె మహాసంస్థాన కనక గురు పీఠాధిపతి ఈశ్వరనందపురి స్వామీజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెంగళూరులో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. వరదలు వచ్చినప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు కేవలం వర్షాలు పడినప్పుడు మాత్రమే ఇక్కడకు వస్తున్నారు.  సీఎం కూడా దీని గురించి గతంలో హామీలు ఇచ్చారు అంటూ బొమ్మై సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో సీఎం బొమ్మై స్వామీజీ పక్కనే కూర్చున్నారు. ఆయన మాటలతో తీవ్ర అసహనానికి గురైన ముఖ్యమంత్రి.. స్వామీజీ మాట్లాడుతుండగానే మైకును చేతుల్లో నుంచి లాగేసుకున్నారు. ‘‘కేవలం హామీలు ఇచ్చి మర్చిపోయే ముఖ్యమంత్రిని కాదు నేను. అది కేవలం హామీ మాత్రమే కాదు. దానిపై మేం ఓ పథకం తీసుకొచ్చాం. నిధులు కూడా కేటాయించాం. పని జరుగుతుంది’’ అని విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. 

Seated next to the #Karnataka CM a seer raked up the issue of flooding in #Bengaluru & questioned empty assurances by leaders to resolve the issue, at this point CM #BasavarajBommai seems irked, snatches the mic and clarifies that he is a CM someone who walks the talk.#BJPGovt pic.twitter.com/sVZUr3xFX9— Hate Detector 🔍 (@HateDetectors) January 27, 2023