‘పఠాన్‌’ ఫస్ట్ డే సెన్సేషన్‌.. ఏకంగా వందకోట్లు !

సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో షారుఖ్‌ ఖాన్, దీపికా పదుకొణె, జాన్‌ అబ్రహం ప్రధాన పాత్రల్లో నటించిన పఠాన్. భారీ అంచనాల మధ్య బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన పఠాన్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తొలిరోజే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌ క్రియేట్ చేసింది. విడుదలైన రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.106 కోట్లు (గ్రాస్‌) కలెక్ట్‌ చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ వెల్లడించింది. ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ ఈ స్థాయిలో రావడం హిందీ చలన చిత్ర పరిశ్రమలోనే ఇదే తొలిసారి అని తెలిపింది.

 ఈ చిత్రం ఇండియాలో రూ. 69 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 37 కోట్ల వ్యాపారం చేసింది. బాయ్‌కాట్‌ ట్రోల్స్‌ ఎదుర్కొన్న చిత్రం ఫస్ట్‌ డే ఇంత కలెక్ట్‌ చేయడం అసాధారణమైన విషయమని సినీ పండితులు అంటున్నారు. రెండో రోజూ అదే స్థాయిలో కలెక్ట్‌ చేస్తుందని అంచనా వేశారు. ఈ చిత్రంలో షారుఖ్, దీపిక, జాన్ ఆబ్రహం ల నటన, విజువల్స్‌ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సల్మాన్ ఖాన్ స్పెషల్ ఎంట్రీ అదిరిపోయింది.