బుట్టబొమ్మ ట్రైలర్ బ్లాక్ బస్టర్

అనికా సురేంద్రన్‌, అర్జున్‌ దాస్‌, సూర్య వశిష్ట ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘బుట్టబొమ్మ’. గ్రామీణ నేపథ్యంలో సాగే ఫీల్‌గుడ్‌ ప్రేమకథా చిత్రమిది. మలయాళీ సినిమా ‘కప్పేల’కు రీమేక్‌గా ఇది సిద్ధమైంది. ఫిబ్రవరి 3న ఈ సినిమా విడుదల కానుంది. 

ఈనేపథ్యంలో శనివారం ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. విశ్వక్‌సేన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. చాలా ఫ్రెష్ గా ఉంది. కూల్ ప్రారంభమైన ట్రైలర్.. ఆ తర్వాత టాప్ గేర్ ను అందుకుంది. ట్విస్టులు.. వాయిలెన్స్ ఎక్కువైంది. ట్రైలర్ చూస్తుంటే.. ఈ చిన్న సినిమా పెద్ద విజయాన్ని అందుకునేలా కనబడుతోంది.