పవన్-సుజీత్ సినిమా ప్రారంభం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్నారు. మరో మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సముద్రఖని, సురేందర్ రెడ్డి సినిమాలు చేయాల్సి ఉంది. ఈ లైనప్ లో కి తాజాగా సుజీత్ సినిమా వచ్చింది. ఈ ఉదయం సుజీత్ – పవన్ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. స్టైలీష్ లుక్ లో ఈ కార్యక్రమానికి పవన్ హాజరయ్యారు.

గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఈ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుంది అనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కమింగ్ అంటూ మెగా అభిమానులు పవన్ లేటెస్ట్ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.