6 రోజులు.. 600 కోట్లు

బాక్సాఫీస్ దగ్గర ‘పఠాన్’ హవా కొనసాగుతుంది. భారీ అంచనాల మధ్య గత బుధవారం (జనవరి 25) పఠాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో.. రోజుకో వంద కోట్లు చొప్పున వసూలు చేస్తోంది. ఐదు రోజుల్లో ఇండియాలో రూ. 335 కోట్లు కలెక్ట్ చేయగా.. ఓవర్సీస్ లో రూ. 207 వసూలు చేసింది. దీంతో వరల్డ్ వైడ్ పఠాన్ వసూళ్లు రూ. 542 కోట్లు దాటిపోయాయి. అయితే ఆరో రోజు కలెక్షన్స్ కలుపుకొంటే.. ఈ లెక్క రూ.600 కోట్లు దాటాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో పఠాన్ చిత్రబృందం సెలబ్రేషన్స్ లో మునిగిపోయింది. గత రాత్రి షారుఖ్ ఖాన్ , దీపికా పదుకొనె, జాన్ అబ్రహం సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరదగా డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది.