జూన్ 16న ‘ఆదిపురుష్’ రిలీజ్

ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో నిజం లేదట. ఆదిపురుష్ ఈ ఏడాదియే రిలీజ్ కానుంది. అది కూడా సలార్ కంటే ముందే థియేటర్స్ లో సందడి చేయనుంది.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జూన్ 16న ఆదిపురుష్ రిలీజ్ కానుంది. అదే రోజు హాలీవుడ్ సినిమా ‘ది ఫ్లాష్’ రాబోతుంది. దీంతో హాలీవుడ్ సినిమాతో ఆదిపురుష్ బాక్సాఫీస్ యుద్ధానికి రెడీ అవుతుంది.
ఈ చిత్రానికి ఓ రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడు పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.