మహేష్ కోసం రూ.10 కోట్లతో విలాసవంతమైన ఇల్లు

సూపర్ స్టార్ మహేష్ కోసం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఓ విలాసవంతమైన ఇల్లు రెడీ అయింది. దాదాపు రూ. 10 కోట్ల ఖర్చుతో ఈ ఇంటిని రెడీ చేశారు. ఐతే  ఇది మహేష్ పర్సనల్ గా వాడుకోవడానికి కాదు. సినిమా సెట్ కోసం. అవునూ.. త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వినూత్నమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా కోసం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఏఎస్‌.ప్రకాష్‌ నేతృత్వంలో ఓ విలాసవంతమైన ఇంటి సెట్‌ను సిద్ధం చేస్తున్నారని తెలిసింది. దీని కోసం రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చేశారట. తదుపరి  షెడ్యూల్‌తో పాటు సినిమాలో ఎక్కువ భాగం ఈ సెట్‌లోనే జరగనుందని టాక్‌. ఈనెల మూడో వారం నుంచి ఈ రెండో షెడ్యూల్‌ ప్రారంభం కానుందని సమాచారం.