నవాజ్‌పై ఆయన భార్య సంచలన ఆరోపణలు

ప్రముఖ నటుడి భార్య నటుడు నవాజుద్దీన్, అతడి భార్య ఆలియా మధ్య గత కొంతకాలంగా వివాదాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె నవాజ్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ.. ఓ వీడియో విడుదల చేశారు.
“నిజం చెప్పాలంటే, అతడేమీ మంచి వాడు కాదు. పిల్లలను కూడా సరిగ్గా చూసుకోలేదు. ఇంతకాలం తర్వాత ఇప్పుడు నాపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నాడు. మొదటి సంతానం కలిగిన తర్వాత నాకు విడాకులు ఇచ్చేశానని అందరికీ చెబుతున్నాడు. అతడి ఆరోపణలు నన్ను ఎంతో బాధపెడుతున్నాయి. 18 ఏళ్లు అతడి కోసం కేటాయించినందుకు చింతిస్తున్నా’’నన్నారు.