కియారా-సిద్దార్థ్ కు టీమ్ #RC15 విషెస్
బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వానీ ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రా ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. అతి కొద్ది అథిదులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహ వేడుక జరిగింది. అయితే ఆదివారం రాత్రి ముంబై లో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించారు. ఈ పార్టీకి బాలీవుడ్ మొత్తం కదిలి వచ్చింది. షూటింగ్ కారణంగా #RC15 మాత్రం కియారా రిసెప్షన్ కు హాజరు కాలేకపోయింది.
ఈ నేపథ్యంలో #RC15 టీమ్ చాలా విన్నూతంగా కియారా-సిద్దార్థ్ జంటకు మ్యారేజ్ విషెస్ చెప్పారు. టీమ్ సభ్యులు మొత్తం చేతుల్లో పువ్వులు పట్టుకొని.. వాటిని ఒకేసారి గాల్లోకి విసురుతూ.. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ కియారా-సిద్ధార్థ్ అంటూ గట్టిగా కేకలు వేశారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్రబృందం ట్విట్టర్ లో షేర్ చేశారు. దర్శకుడు శంకర్, హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు తో పాటు.. చిత్రబృందం మొత్తం ఈ వీడియోలో ఉన్నారు. ఇప్పుడీ.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Team #RC15 #SVC50 wishes @SidMalhotra & @advani_kiara a very happy married life!#SidKiaraReception #KiaraAdvani @AlwaysRamCharan @shankarshanmugh@DOP_Tirru @MusicThaman
@SVC_official #ottrelease pic.twitter.com/Xj4cWs3ODX— OTTRelease (@ott_release) February 13, 2023