ఆదిపురుష్ పై ది ఫ్లాష్ ఎఫెక్ట్.. రెండు ఒకేరోజు రిలీజ్ !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ‘ఆదిపురుష్’. రామాయణ యుద్దకాండగా తెరకెక్కింది. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడుగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఆదిపురుష్ కొన్ని కారణాల వలన వచ్చే ఏడాది (2024) కి వాయిదా పడినట్లు వార్తలు వినిపించాయి.

కానీ అందులో ఏమాత్రం నిజం లేదట. ఆదిపురుష్ జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేరోజు బాలీవుడ్ సినిమా ‘ది ఫ్లాష్’ కూడా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ యుద్ధం జరగనుంది. ముఖ్యంగా ఆదిపురుష్ ఓవర్సీస్ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడనుంది. ఈ నేపథ్యంలో ఓ వారం ముందు వెనక్కి ఆదిపురుష్ రిలీజ్ ను అడ్జెస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రెండు నెలల గ్యాప్ లో ప్రభాస్ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అంతేకాదు.. మారుతి – ప్రభాస్ సినిమా ఈ ఏడాదియే రిలీజ్ కానుంది. దీంతో ఈ ఏడాది ప్రభాస్ హ్యాట్రిక్ సినిమాలతో సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.