నెక్ట్ ఫ్లిక్స్ కు వెంకీ వార్నింగ్
విక్టరీ వెంకటేష్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గన్ చేతిలో పట్టుకొని మరీ.. బెదిరించారు. అది కూడా తన అన్న కొడుకు, హీరో రానా దగ్గుబాటి విషయం కావడంతో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ వెంకీ కోపానికి కారణం ఏంటీ ? దానికి రానా ఎలా కారణమయ్యారు అంటే.. ?
బాబాయ్-అబ్బాయ్ వెంకీ-రానా కాంబోలో ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ తెరక్కెకుతోన్న సంగతి తెలిసిందే. కరణ్ అన్షుమాన్ , సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా స్ట్రీమింగ్.. 2013 క్రైమ్ టీవీ సిరీస్ వచ్చిన ‘రే డోనోవన్’కి అఫిషీయల్ రిమేక్. లోకోమోటివ్ గ్లోబల్ ఇంక్ బ్యానర్‌పై సుందర్ ఆరోన్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
అయితే ఈ వెబ్ సిరీస్ టైటిల్ ‘రానా నాయుడు’ అని పెట్టడం వెంకీకి అస్సలు నచ్చనట్టు ఉంది. గన్ పట్టుకొని కెమెరా ముందుకు వచ్చి నెట్ ఫ్లిక్స్ కు వార్నింగ్ ఇచ్చారు. “మిస్టేక్స్ చేయొద్దు నెట్ ఫ్లిక్స్. హీరో ఎవరు ? నేను. స్టార్ ఎవరు ? నేను. సినిమా చూసే ఫ్యాన్స్ ఎవరు ? నా అభిమానులు. టైటిల్ ఎవరిది ఉండాలి. నాగ నాయుడు. మజాక్.. మజాక్ చేస్తే.. అబ్దుల్ రజాక్ అవుతారు” అంటూ హెచ్చరించారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెంకీ చేసిన.. ఈ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
@VenkyMama strong warring to @NetflixIndia 😃#RanaNaidu @RanaDaggubati #OTTRelease #Netflix pic.twitter.com/JPSHYE6C5y— OTTRelease (@ott_release) February 13, 2023