సార్.. మెగా సప్రైజ్ !

‘సార్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు కోలీవుడ్ స్టార్ ధనుష్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా చిత్రమిది. సంయుక్త మీనన్ హీరోయిన్. జీవీ ప్రకాష్  సంగీతం అందించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది.

ఈ శుక్రవారం (ఫిబ్రవరి 17) సార్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తారని ప్రచారం జరిగింది. కానీ పవర్ స్టార్ రావడం లేదు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు సమాచారం.