నెక్ట్స్ రకుల్ నే.. త్వరలోనే ప్రియుడితో పెళ్లి !

సినిమా పరిశ్రమలో ఒక సీజన్ స్టార్ట్ అయింది అంటే.. అది కొనసాగుతూనే ఉంటుంది. హీరోయిన్స్ ఒకరు తర్వాత ఒకరు పెళ్లిళ్లు చేసుకోవడం.. ఆ తర్వాత ఒకరి తర్వాత మరోకరు తల్లి కావడం.. ఆ శుభ వార్తలను అభిమానులతో పంచుకోవడం చూస్తుంటాం. ఈ క్రమంలో ఇటీవలే ఓ ఇల్లాలు అయింది బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ. ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడింది. ఆదివారం ముంబైలో మస్త్ దావత్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో కియారా తర్వాత నెక్ట్శ్ ఎవరు ? అనే చర్చ మొదలైంది. దానికి ఆన్సర్ చెప్పే క్రమంలో అందరూ రకుల్ ప్రీత్ సింగ్ పేరు చెబుతున్నారు.

బాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ అండ్ హీరో జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. జాకీ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. దీనికితోడు గతంలో ఓ సందర్భంలో రకుల్ ప్రీత్ తన పెళ్లి విషయం ఓపెన్‌ గా మాట్లాడింది. జాకీ భగ్నానీతో తానూ ప్రేమలో ఉన్నాను అని ఆమె తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదియే రకుల్ – జాకీ పెళ్లి జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.