షెహనాజ్ గిల్.. వాలైంటైన్స్ డే గిఫ్ట్ !

పంజాబీ బ్యూటీ షెహనాజ్ గిల్ వాలైంటైన్స్ డే గిఫ్ట్ అందించింది. పింక్ కలర్ చీరలో డబూ రత్నాని కెమెరా ముందు ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. చూపులు తిప్పుకోని అందంతో ఆకట్టుకుంటోంది. అభిమానులకు పసందైన వాలైంటైన్స్ డే గిఫ్ట్ అందించింది.. ఈ ముద్దుగుమ్మ.

షెహనాజ్ గిల్ మ్యూజిక్ వీడియోస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది. బోలేడు వీడియోలు చేసింది. ఏడాదిలో ఇరవైకి పైనే ఆమె మ్యూజిక్ వీడియోస్ ఉంటాయి. ఇక బిగ్ బాస్ సీజన్-13 తో షెహనాజ్ మరింత పాపులర్ అయింది.

అదే సమయంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ కు దగ్గరైంది. వీరిద్దరి మధ్య ఏదో సాగుతుందనే ప్రచారం బాలీవుడ్ లో జోరుగా జరుగుతుంది. సల్మాన్ కనిపిస్తే చాలు.. ఈ ముద్దుగుమ్మ కంట్రోల్ తప్పుతుంది. ఆయన మీద పడిపోయి ముద్దులు ఇస్తుంటుంది. ఈ ముద్దుగుమ్మ సల్మాన్ తాజా సినిమా ‘కభీ ఈద్ కభీ దీపావళి’లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.