‘ఇండియన్ 2’ కోసం నెల రోజులు

గ్రేట్ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా (#RC15) లేటెస్ట్ షెడ్యూల్ బుధవారంతో పూర్తయింది. ఈ నేపథ్యంలో దర్శకుడు శంకర్ ‘ఇండియన్ 2’ వైపు షిఫ్ కానున్నారు.

ఈ సినిమా షెడ్యూల్ గురువారం నుంచి ఏకధాటిగా 30 రోజుల పాటు చెన్నై లోని ఆదిత్య రామ్ స్టూడియోస్ లో జరగనుంది. మార్చి 12 ఆస్కార్ వేడుక జరగనుంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఆర్ ఆర్ ఆర్ టీమ్ వెళ్లనుంది. ఈ నేపథ్యంలో శంకర్ ఇండియన్ 2 నెలరోజుల షెడ్యూల్ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత మళ్లీ రామ్ చరణ్ సినిమా కొత్త షురూ కానుంది. కొత్త షెడ్యూల్ లో కొత్త పెళ్లి కూతురు కియారా అద్వానీ కూడా పాల్గొననున్నారు.