IPL2023 షెడ్యూల్ వచ్చేసింది
ఐపీఎల్ కొత్త సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 31వ తేదీన గతేడాది ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 2023 మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. ఫైనల్ మ్యాచ్ మే 28న జరగనుంది. హైదరాబాద్ వేదికగా ఏప్రిల్ 2వ తేదీన సన్రైజర్స్ – రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. లీగ్ల వరకు షెడ్యూల్ ప్రకటించిన నిర్వాహకులు.. ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ వేదికలను ప్రకటించాల్సి ఉంది. పది జట్లు పాల్గొనే ఐపీఎల్ 2023 సీజన్లో మొత్తం 70 లీగ్ మ్యాచ్లు జరుగుతాయి.
ఏడేసి మ్యాచ్లను సొంత మైదానం, వెలుపల స్టేడియాల్లో ఆడాల్సి ఉంటుంది. గ్రూప్ – Aలో ముంబయి ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఉన్నాయి. గ్రూప్ – Bలో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఉన్నాయి.