సరదా సెటియా

‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది షిర్లే సెటియా. నాగ శౌర్యతో కలిసి రొమాన్స్ చేసింది. సెటియా మంచి గాయని. దాదాపు 20 పాటలకు పైగా పాడింది. ఆల్బమ్స్ చేసింది. గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత హీరోయిన్ గా మారింది.

‘మస్కా’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె సెకండ్ సినిమాలో తెలుగులో ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ సినిమా కమర్షియల్ గా ఆడకున్నా.. షిర్లే నటనకు మంచి మార్కులే పడ్దాయి. ఆ తర్వాత నికమ్మా (హిందీ) సినిమాలో నటించింది. మరోవైపు స్పెషల్ ఫోటో షూట్స్ తో గ్లామర్ ను ఒలకబోస్తోంది. మరిన్ని ఆఫర్లు దక్కించుకునే పనిలో ఉంది. ఇందులో భాగంగా తాజాగా హాట్ హాట్ గా ఫోటోలకు పోజులిచ్చింది.