కేసీఆర్ కు తప్పిన బర్త్ డే స్ట్రోక్

ఫ్రై డే రాజకీయాలు స్పైసీగా ఉంటాయ్. సంచలనాలు ఉంటాయని అందరూ భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలను బీఆర్ ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. భయపడినట్లుగా ఎమ్మెల్యేల ఎర కేసు తుదితీర్పు ఇంకా రాలేదు. కానీ స్టేట్ మెంట్ మాత్రం వ్యతిరేకంగానే ఉంది. అదే ఫైనల్ తీర్పు వచ్చి ఉంటే.. కేసీఆర్ పుట్టినరోజున చేదు వార్త విన్నట్లు ఉండేది. 

మొయినాబాద్ ఎమ్మెల్యేలకు ఎర కేసును రాష్ట్ర హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంలో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే, బీజేపీ తరఫున సీనియర్‌ న్యాయవాది జెఠ్మలానీ వాదనలు వినిపించారు.

ఇంకా చాలా విషయాలు తమ వద్ద ఉన్నాయని.. సీబీఐ, ఈడీ కూడా రోజు లీకులు ఇస్తున్నాయన్నాయని దవే అన్నారు. కేంద్రంలోని అధికార పార్టీకి వ్యతిరేకంగా ఆధారాలున్నాయని తెలిపారు. కేసును సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం ఏముందని, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలోని సీబీఐ భాజపాపై ఎలా విచారణ చేస్తుందని దవే ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి తనకు ఎక్కువ సమయం కావాలని దవే కోర్టును కోరారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ ఈనెల 27న దీనిపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.