రెండో టెస్టులో భారత్ విజయం

ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 263 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 262 పరుగులు అయిన సంగతి తెలిసిందే. ఒక్క పరుగు ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 113 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (7/42), అశ్విన్ (3/59) అదరగొట్టారు.

ఇక 115 పరుగుల ఆధిక్యంలో బరిలోకి దిగిన టీమిండియా 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 31 (20 బంతుల్లో) దూకుడుగా ఆడగా.. పూజారా (31 నాటౌట్) తనదైన శైలిలో క్రీజులో పాతుకుపోయాడు. ఆఖరులో తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ 23 (20 బంతుల్లో) ధాటిగా ఆడటంతో టీమిండియా చాలా ఫాస్ట్ గా లక్ష్యాన్ని ముద్దాడింది. నాలుగు టెస్టుల సిరీస్ లో 2-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది.