చిరు ఇంటికి కేంద్ర మంత్రి

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన రాజకీయాల్లోకి పోవడం లేదు. కానీ రాజకీయాలే ఆయన దగ్గరకు వస్తున్నాయి. తాజాగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చిరంజీవి ఇంటికి వచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ నే తెలిపారు. అనురాగ్ ఠాకూర్ తో దిగిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అనురాగ్ ఠాకూర్ ను ఆదివారం చిరు తన ఇంటికి ఆహ్వానించారు. కింగ్ నాగార్జున కూడా రావడంతో.. ముగ్గురు కలిసి తెలుగు సినిమా అభివృద్ధి పై చర్చించినట్లు చిరు తెలిపారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది గాడ్ ఫాదర్ తో హిట్ కొట్టారు మెగాస్టార్. ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో మరో విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఇవాళ్టి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం చిరు భోళాశంకర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత పూరి డైరెక్షన్ లో చిరు సినిమా ఉండనుంది అనే ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.