క్యాజువల్ బ్యూటీస్

ఒక్కొక్కసారి ఇద్దరి హీరోయిన్స్ ఒకేలా కనిపిస్తుంటుంది. ఒకే రకమైన డ్రెస్.. ఒకే రకమైన స్టయిల్ లో దర్శనమిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్, అదితిరావు హైదరీ క్యాజువల్ డ్రెస్ లో అదరగొట్టారు.

లేత నీలిరంగు చొక్కాతో కూడిన తెల్లటి టీ-షర్ట్‌తో సాధారణ వస్త్రధారణలో కరీనా కనిపించింది. బ్లాక్ కలర్ లెగ్గింగ్‌లతో.. ఒక జత తెల్లటి మిడ్-కాఫ్ సాక్స్, ఒక గోధుమ రంగు హ్యాండ్‌బ్యాగ్ ..బ్లాక్ సన్ గ్లాసెస్‌తో స్టయిలీష్ గా కనిపించింది.

మరోవైపు అదితి రావు హైదరి కూడా క్యాజువల్ డ్రెస్ లో కూల్ గా కనిపించింది. లైట్ కలర్ డ్రెస్ లో .. ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఇద్దరు ముద్దుగుమ్మల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. క్యాజువల్ బ్యూటీస్ బాగున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.