సైఫ్ అయినా.. సంజయ్ అయినా వదలం.. ! విషాదంలోనూ.. శత్రుత్వమా ?
విషాదంలోనూ విరోదం మరచిపోవడం లేదు మంత్రి కేటీఆర్. ప్రస్తుతం బీఆర్ ఎస్ బీజేపీని గట్టిగా ఢీకొట్టున్న సంగతి తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే.. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల కారణంగా పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. నిమ్స్ చికిత్స పొందుతూ.. ఐదు రోజుల పాటు పోరాడుతూ ప్రీతి నిన్న కన్నుమూసింది. ఈ నేపథ్యంలో నిందితుడు సైఫ్ ను ఉరితీయాలనే డిమాండ్ వినిపిస్తోంది . అదే సమయంలో సైఫ్ తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీకి బంధువు కావడంతో.. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది అనే విమర్శలు ఉన్నాయి. దిశకో న్యాయం ప్రీతికో న్యాయమా ? అని జనాలు ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజా ప్రీతి ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు.
ప్రభుత్వం, పార్టీ పరంగా ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాలేజీలో జరిగిన ర్యాగింగ్ వల్ల డాక్టర్ ప్రీతి మృత్యువాత పడటం చాలా బాధాకరమన్నారు. ఈ విషయాన్ని కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. నిందితులు ఎవరైనా.. ఎంతటివారైనా వదిలేది లేదన్నారు. నిందితుడు సైఫ్ అయినా.. సంజయ్ అయినా వదిలిపెట్టమని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఈ విషాద ఘటనలోనూ కేటీఆర్ ప్రత్యర్థి బండి సంజయ్ లోని పేరులోని సగం పేరు యాస పేరిట ప్రస్తావించడం తగునా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తూ.. సైఫ్ ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు