సెల్ఫీ దెబ్బ.. అక్షయ్ కుమార్ కు మరోసారి ఘోర అవమానం !

ఎంతటి స్టార్ క్రికెటర్ అయినా ఫామ్ కోల్పోవడం సాధారణం. ఇది సినీ స్టార్స్ కూడా వర్తిస్తుంది. కొన్నేళ్లుగా సరైన హిట్ లేని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ‘పఠాన్’ తిరిగి హిట్ ట్రాక్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పఠాన్ వెయ్యి కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసింది. బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేసేందుకు చేరువైంది. ఈ విషయం పక్కనపెడితే.. గతంలో షారుక్ మాదిరిగా మరో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఫామ్ లేమితో బాధపడుతున్నారు. ఆయన ప్రతి సినిమా నిరాశపరుస్తుంది.

అక్షయ్ కుమార్ లేటెస్ట్ ఫిల్మ్ ‘సెల్ఫీ’ అయితే బాక్సాఫీస్ దగ్గర దారుణంగా విఫలమైంది. గత శుక్రావారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నెగటివ్ టాక్ ను మూటగట్టుకుంది. తొలి రోజు రూ. 2.55 కోట్లు, రెండోరోజు రూ. 3.80 కోట్లు, మూడోరోజు రూ. 3.95 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. మొత్తంగా మూడ్రోజుల్లో రూ. 10.3 కోట్లు వసూలు చేసింది. అంతేకాదు.. ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్న ప్రేక్షకులు ప్లాప్ టాక్ కారణంగా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అంత దారుణంగా సినిమా ఉంది.

ఈ చిత్రానికి రాజ్ మెహతా దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ, డయానా పెంటీ, నుష్రత్ బరుచా.. తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. 2019 లో వచ్చిన మలయాళ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్‌కి ‘సెల్ఫీ’ అధికారిక రీమేక్ ఇది.