మూడో టెస్ట్ లో భారత్ ఓటమి


అతి ఎప్పుడూ మంచిది కాదు. క్రికెట్ లోనూ అంతే. బోర్డర్‌ – గావస్కర్‌ ట్రోఫీ లో వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్ లు గెలిచిన టీమిండియాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైనట్టు కనిపించింది. సిరీస్ ముగియకముందే డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. ఆ అతి ఆలోచనల ఫలితంగా మూడో టెస్ట్ లో టీమిండియా దారుణం ఓడిపోయింది.

ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 109 పరుగులకే కుల్పకూలగా.. ఆసీస్ 197 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో భారత్ 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో.. ప్రత్యర్థి ముందు కేవలం 76 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఇక స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ ఒక వికెట్ నష్టపోయి చేధించింది. దీంతో.. స్వదేశంలో టీమిండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నట్లు అయింది.