పుష్ప 2 విలన్ జాయినింగ్ !

సుకుమార్ – అల్లు అర్జున్ ల హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’ సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తగ్గేదేలా.. పుష్పరాజ్ మేనరిజం ఇంటర్నేషనల్ స్థాయిలో ట్రెండ్ గా మారింది. ఇప్పుడు పుష్ప సీక్వెల్ గా పుష 2 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

తాజాగా పుష్ప 2 షూటింగ్ లో నటుడు ఫాహద్ ఫాజిల్ జాయిన్ అయ్యారు. పార్ట్ 1 లో ఆయన ఎస్పీ భన్వ‌ర్‌ సింగ్ షెకావ‌త్ పాత్రలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. క్లైమాక్స్ లో పుష్పరాజ్ – భన్వ‌ర్‌ సింగ్ షెకావ‌త్  మధ్య వచ్చే సీన్ సినిమాకే హైలైట్. తనని ఘోరంగా అవమానించిన పుష్పరాజ్ పై ఎస్పీ ఎలా ప్రతీకారం తీర్చుకోబోతున్నాడు ? అన్నది సెకాంఢాఫ్ లో చూపించే అవకాశాలు ఉన్నాయి. ఇక పార్ట్ 2 లో మరో విలన్ గా కనిపించబోతున్నారు. ఆ పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఈ చిత్రంలో బన్నీకి జంటగా రష్మిక మందన నటించారు. సునీల్, అనసూయ, తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. మైత్రీ మూవీస్ నిర్మించింది. పుష్ప 2 విషయంలో అస్సలు తగ్గేదేలా.. అని బన్నీ అంటున్నారు. పార్ట్ 1 కంటే పార్ట్ 2 బాగుంటుందని సుకుమార్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప 2 పై ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.