లియో 90 డేస్ టార్గెట్

దళపతి విజయ్ 67 ‘లియో’ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘మాస్టర్’ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. భారీ తారాగణంతో ఈ గ్యాంగ్ స్టర్ చిత్రం తెరకెక్కుతోంది. విజయ్ కి జంటగా త్రిష నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

దసరా రిలీజ్ టార్గెట్ ఈ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మే నెలలోపు షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లియో చిత్రబృందం టార్గెట్-90 డేస్ గా పెట్టుకుందట. ప్రస్తుతం కాశ్మీర్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ విపరీతమైన పరిస్థితుల్లో దాదాపు వెయ్యి మందితో షూటింగ్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో విక్రమ్ కమల్ హాసన్, రొలెక్స్ సూర్య, ఢిల్లీ కార్తీ పాత్రలు కూడా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు దర్శకుడు లోకేష్ కనగరాజ్ అద్భుతంగా స్క్రిప్ట్ రెడీ చేశారని చెబుతున్నారు.