#Suriya42 ప్రీ రిలీజ్ బిజినెస్.. ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ !

సూర్య 42 శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చాలా వైవిధ్యమైన కథతో రూపుదిద్దుకుంటోంది. 1678 లో ఓ డిసీస్ వలన చనిపోయిన యోధుడు మీద ప్రస్తుతం ఓ యువతి చేసే రిసెర్చ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. యోధుడిగా గుర్రం మీద తిరుగుతున్న సూర్య ఫోటోలు ఇప్పటికే బయటికొచ్చాయి. ఆ తర్వాత ఈ తరం యువకుడిగా కనిపించే సూర్య లుక్ రివీల్ చేశారు మేకర్స్. ఇందులో సూర్యకి జంటగా దిశా పటానీ, మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. #Suriya42 ప్రీ రిలీజ్ బిజినెస్ అప్పుడే పూర్తయిందట. అంతేకాదు.. కోలీవుడ్ లోనే హైయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. ఇంకా సినిమా టైటిల్ ఖరారు కాలేదు. టీజర్, ట్రైలర్ లాంటివి ఎలాంటివి కూడా రిలీజ్ చేయకముందే ప్రీ రిలీజ్ బిజినెస్ తో ఇండస్ట్రీ రికార్డులను సూర్య 42 బ్రేక్ చేసిందని చెబుతున్నారు. అయితే ఆమౌంట్ ఫిగర్ ఎంత ? అన్నది మాత్రం బయటికి చెప్పడం లేదు.